Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆగస్టులో మోడీ నేపాల్ పర్యటన

భారత ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో నేపాల్ లో పర్యటించనున్నారు. ఆగస్టు మొదటి వారంలో ఆయన ఖాట్మండు వెళతారు. ఇటీవలే భూటాన్ లో పర్యటించిన మోడీ పొరుగుదేశాలతో సంబంధాలపై ప్రధానంగా దృష్టిపెట్టారు. కాగా, 17 ఏళ్ళ తర్వాత ఓ భారత ప్రధాని ద్వైపాక్షిక చర్చల కోసం నేపాల్ లో పర్యటించడం ఇదే ప్రథమం. అంతకుముందు 1997లో అప్పటి ప్రధాని ఐ.కె. గుజ్రాల్ నేపాల్ లో పర్యటించారు. కాగా, 2002లో అప్పటి ప్రధాని వాజ్ పాయి నేపాల్ లో పర్యటించారు. అయితే, అప్పుడు ఆయన సార్క్ దేశాల సమావేశం కోసం అక్కడికి వెళ్ళారు.

More Telugu News